Saturday, April 17, 2010

వెంటాడుతున్న గతం!

"నచ్చినట్టు వుండమంటె రోజంతా పనులన్నీ వదిలేసి నీతో మట్లడుతూ వుండేదాన్ని"

గతం మరువాలని వున్నా, మరువనీయని నీ గురుతులు నను వెంటాడుతూనే వున్నాయి.
ఎదో చుస్తూ వుంటే.. నీవు పంపిన ఈ SMS నాకు కనిపించిది.... :)

ఓక సం!! లో ఎన్ని మార్పులో కదా!

నాకు ఇంకా అప్పటిలాగనే నీతో మట్లాడుతునే వుండాలని వుంది...

వెర్రివాడిని కదా!
మారుతున్న కాలంలో,
మరుగవుతున్న మమతల మధ్య,
మనసు, మంచి, మమత, మానవత్వం అనుకొంటూ.... :)
మనిషిలా మారలేక,
మరణించే ధైర్యం లేక,
మౌనంగా విలపిస్తున్నా...
మైమరపించే అనురాగం దరిచేరకపోయినా,
మరణమైనా తప్పక నాదరి చేరుతుందని...
ఆశగా ఏదురుచూస్తూ....

Thursday, April 15, 2010

ఒక్కసారి నిను చూడాలని వుందిరా!

నా మనసు మనసులా లేదు, నీవెలా వున్నావో అన్న వేదన ఇప్పటికి గత 15 రోజులనుంచి నా హ్రుదయాన్ని తొలిచేస్తుంది.
నిన్నడితే, "నాకేం నేను బాగానే వున్నా " అంటావు. నా కళ్ళతో చూస్తేకాని నా అలజడి ఆగేలా లేదు. నా హ్రుదయం నాకు తప్పుచెప్పదు. నువ్వెక్కడ వున్నా ఆనందంగా వుండాలనే నేను దూరంగా వుంటున్నాను. ప్రతీక్షణం నీతోడుగా వుండాలనే నా ఆశ తీరేదేనాటికో!

ఒక్కసారి నిను చూడాలని వుందిరా!

Luv u raaaa.....!!!!

Friday, April 2, 2010

మట్లాడాలని వుంది!



కమ్మని కలలా వచ్చి,
నను మైమరిపించావు!

మురిపించే చెలిమిలా నను చేరి,
నా చెలివై నను ప్రేమనే మత్తులో ముంచేశావు!

నా ఆశల సౌధానికి రాణివై నా తోడు వుంటానని,
నను ఒంటరిని చేసావు!

నాలోని ప్రాణం నీవని తెలిసినా ఎందుకే ఇలా ఆటలడేస్తున్నావు?


Thursday, April 1, 2010

:) It's my DAY...



".. Love's not Time's fool, though rosy lips and cheeks, within his bending sickle's compass come.
Love alters not with his brief hours and weeks, but bears it out even to the edge of doom.
If this be error and upon me proved, I never writ, nor no man ever loved."

William Shakespeare (1564 - 1616)



don't forget to wish me on this day.
It's my fault....