నీకై ప్రతీక్షణం ఎదురుచూసే నా కనులకేం తెలుసు... నీవు కానరావని! జీవనదిలా ప్రవహించే నా కన్నీటికేం తెలుసు.... అవి నిన్ను కదిలించలేవని! అలలా ఎగసిపడి అలసిన నా హ్రుదయానికేం తెలుసు... ఊరడించే చెలి(మి) లేదని, రాదని, ఇకపై రాలేదని!
తెలిసి జరిగినా, తెలియక జరిగినా...
మొత్తనికి నాకు తెలిసేలా జరిగింది...
:)
బాధ అంటే ఏమిటో..
ఎడబాటు అంటే ఏమిటో..
జీవితం అంటే ఏమిటో..
చివరగా నేనేమిటో...
ప్రస్తుతం మిగిలింది.. "నేను" మాత్రమే ..
నా గురించి తెలుసుకోవడానికి..
నేనేమీ మహానుభావుడిని కాదు,
నేను మహాత్ముడిని అంతకంటే కాదు..
అన్నీ కోల్పొయిన, ఓ చేతకాని వాడిని..
చావలేని ఓ జీవిని.. అంతే..
No comments:
Post a Comment